తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్ అందుకున్నారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది ప్రతినిధులతో కలిసి తరగతులకు హాజరైన ఆయన, అధ్యాపకులు మరియు సహ విద్యార్థుల నుంచి ఎంతో విలువైన అనుభవం సంపాదించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
