పురపాలక చైర్మన్ రాంబార్కి శరత్
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ప్రాచీన హస్తకళలను ఆదరించి హస్త కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. సోమవారం బొబ్బిలి పట్టణంలో ఉన్న శ్రీ కళాభారతి ఆడిటోరి యంలో క్రాఫ్ట్ బజార్ 2026 చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకాలను జ్యోతి ప్రజ్వలన చేసి బొబ్బిలి పురపాలక చైర్మన్ రాంబార్కి శరత్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన హస్తకళలు భారతీయ సంస్కృతికి, నిలు వెత్తు నిదర్శనమన్నారు.అనంతరం శ్రీ కళా భారతి ఆడిటోరియం కార్యదర్శి నంబియార్ వేణుగోపాలరావు మాట్లాడుతూ స్వదేశీ వస్త్రాలు మరియు చేతి వృత్తులును ప్రతీ ఒక్కరు ప్రోత్సాహించాలని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్య కేంద్రాలు ద్వా రా ఆయా రంగాలలో శిక్షణ ఇస్తున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో శ్రీ కళాభారతి సంయుక్త కార్యదర్శి పుల్లెల శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు..
