నాగాయలంక: నాగాయలంక మండలంలోని సొర్లగొంది గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కుటుంబాలను ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకుడు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ తుము వెంకటేశ్వరరావు, తుము నాగ మల్లేశ్వరమ్మ, తుము కృష్ణ కుమారి, తుము లావణ్య, కరణి నరసింహారావు, నాయుడు శ్రీలక్ష్మి లతో వ్యక్తిగతంగా కలసి, వారి పరిస్థితిని తెలుసుకున్నారు.
పరామర్శలో స్థానిక పెద్దలు, కుటుంబ సభ్యులు, తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంలో తుము ధర్మరాజు, తుము తాతయ్య, నాయుడు రామయ్య, తుము అర్జునరావు, నాయుడు ప్రభు ప్రసాద్, విశ్వనాథపల్లి రాంబాబు, కొప్పనాతి నాగేశ్వరరావు, మోదు నాగేశ్వరరావు, తుము ఆంజనేయులు, నాయుడు నాగరాజు, విక్కుర్తి రాంబాబు, న్యాయవాది విక్కుర్తి రామక్రిష్ణ, పులిగడ్డ చంద్ర, భూపతి నాంచారయ్య, బర్మా శ్రీను, రేపల్లె ఈశ్వరరావు, పున్నయ్య చౌదరీ తదితరులు పాల్గొని బాధితులను మద్దతు ఇచ్చారు.
విక్కుర్తి ఈ ఘటనకు గాయపడినవారికి అగాధ శ్రద్దాభావంతో వారిని సానుకూలంగా పరామర్శిస్తూ, అవసరమైన సహాయ చర్యలను తీసుకోవడానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
