సేవా కార్యక్రమాలతో సంతృప్తి

*తన పుట్టిన రోజు సందర్భంగా సామాజిక సేవలో డాక్టర్ హేమాక్షి


  • పార్వతీపురం ఎల్లో సింగం ప్రతినిధి: మనం అందించే ఏ చిన్న సాయమైనా ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందని సీతానగరం మండలం బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి. హేమాక్షి పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా పార్వతీపురం మండలం దాలినాయుడువలస గ్రామంలో ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు అందజేశారు. అనంతరం వారి ఆరోగ్య సమాచారం తెలుసుకొని తగు సూచనలు చేశారు. ఈసందర్భంగా డా. హేమాక్షి మాట్లాడుతూ ప్రతీ ఏటా ప్రత్యేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పేదలకు మనం అందించే ఏ చిన్న సాయమైనా ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుందని, ప్రతీ ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాని హితవు పలికారు. మా సోదరుడు జిల్లా ఆర్.బి.ఎస్.కె ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు వృత్తిలో, సేవలో మాకు ఎంతో స్పూర్తిదాయమని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం అక్కడ వారు డాక్టర్ హేమాక్షి కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.
WhatsApp Join Now
Youtube Subscribe