గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి చేరుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి తో కలిసి ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ ద్వారా పౌరసేవలను వేగవంతంగా అందిస్తున్న విధానం, రియల్ టైమ్ డేటా సేకరణ, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగంపై బిల్ గేట్స్ విశేష ఆసక్తి చూపారు. చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టు అమలు, డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజలకు వైద్య సలహాలు, బయో డిజైన్ ఆధారిత వైద్య సేవలు, డయాగ్నోస్టిక్ సౌకర్యాల పరిధి వంటి విషయాలను గేట్స్ పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళిక, 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ భూభాగంతో కూడిన పద్ధతిని కూడా గేట్స్ మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ డేటా లీక్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, బ్లాక్ చెయిన్, క్యూ ఆర్ కోడ్ విధానాల ద్వారా పౌరసేవల పారదర్శకత, పన్నుల వసూళ్లలో పెరుగుదలను సాధించిన వివరాలు తెలిపారు. బిల్ గేట్స్ ఈ వృద్ధిని ‘గ్రేట్ వర్క్’ అని ప్రశంసించారు.
సీఎంతో కలిసి ఆర్టీజీఎస్, రాజధాని అమరావతి ప్రాజెక్టులను పరిశీలించిన బిల్ గేట్స్ – పాలనలో టెక్నాలజీ వినియోగంపై సంతృప్తి
16
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
