సింహాచలం అప్పన్న అన్నప్రసాద పథకానికి రూ.1,01,116 విరాళం

విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం లో నిత్య అన్నప్రసాద పథకానికి శనివారం రూ.1,01,116 విరాళం అందింది. విశాఖపట్నం ద్వారకానగర్‌కు చెందిన లేజర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి శ్రీ ఎం. ప్రసాద రావు ఈ విరాళాన్ని సమర్పించారు. డిమాండ్ డ్రాఫ్ట్ (D.D. No: 12952) రూపంలో అందజేసిన ఈ మొత్తాన్ని దేవస్థానం ప్రోటోకాల్ కార్యాలయంలో ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి ఏ. తిరుమూర్తులు స్వీకరించారు. దాతల కోరిక మేరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న వారి పేరున (కౌశిక గోత్రం) అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం దాత స్వామివారిని దర్శించుకుని, దేవస్థానం తరఫున శేషవస్త్రంతో సత్కారం అందుకున్నారు. ఆలయ వేదపండితులు వేద ఆశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలు ఇచ్చారు. అన్నప్రసాద పథకానికి భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం అభినందనీయమని దేవస్థానం ప్రతినిధులు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe