పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో సిమ్ కార్డులు విక్రయించే అన్ని మొబైల్ దుకాణాలు మరియు రిటైల్ కేంద్రాలకు సరైన గుర్తింపు ధృవీకరణ (కేవైసీ) లేకుండా సిమ్ కార్డులు జారీ చేయరాదని అవగాహన నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ కె వి సతీష్ కుమార్ మాట్లాడుతూ, సరైన పత్రాలు లేకుండా సిమ్ కార్డులు ఇవ్వడం వల్ల సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశాలు పెరుగుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన కేవైసీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు పరిశీలించిన తరువాత మాత్రమే సిమ్ జారీ చేయాలని సూచించారు. ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ వ్యక్తిగత వివరాలు జాగ్రత్తగా వినియోగించుకోవాలని, అనుమానాస్పద అంశాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సరైన గుర్తింపు లేకుండా సిమ్ కార్డుల విక్రయాలపై కఠిన చర్యలు – పెందుర్తి పోలీసుల అవగాహన నోటీసులు
14
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
