సమస్యను నిన్న చూశారు.. నేడు పరిష్కరించారు…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

22వ వార్డులో చురుగ్గా సాగుతున్న పారిశుద్ధ్య పనులు

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-

పార్వతీపురం మున్సిపాలిటీలో 22వ వార్డులో నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమంలో పర్యటించిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర కు ప్రజలు పలు సమస్యలను చూపించారు. ఆ సమస్యలను చూసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. అందులో భాగంగానే నేడు 22వ వార్డులో కాలువల్లో పూడికలు యుద్ధ ప్రాతిపదికన తీయించారు. వార్డు పర్యటనలో ప్రజలకు ఇచ్చిన మాట తక్షణమే ఆయన నిలబెట్టారు. ఒక్క 22వ వార్డు కాకుండా మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కూడా ఇదే విధంగా సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర శ్రీకారం చుట్టడంతో పట్టణ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు…

WhatsApp Join Now
Youtube Subscribe