సంక్రాంతి కానుకగా పీఆర్సీని తక్షణమే ప్రకటించాలి..

ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు జె సి రాజు

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-

ఉద్యోగులు,ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్న 12 వ పీఆర్సీని సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ప్రకటించి ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వమని నిరూపించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు జె సి రాజు డి మాండ్ చేశారు.ఆదివారం స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ,ఉపాధ్యాయులకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చే పీఆర్సీని, మధ్యంతర భృతి, డీ ఏ బకాయిలు, సరండర్ లీవ్ బకాయిలు ఎప్పుడెప్పుడు చెల్లిస్తారా అని రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛను దారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని కానీ నెలలు గడుస్తున్నా ప్రభుత్వం సంక్రాంతి సమీపిస్తున్న ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం విచారకరమని అన్నారు.ఆర్ధిక బకాయిల చెల్లింపులను విస్మరించటం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు.గడచిన కాలంలో ప్రభుత్వాలు నూతన సంవత్సరం నాడో పర్వదినాలకో ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకొని ప్రకటించేవారని ,మూడు నెలల క్రితం ఒక డీ ఏ ఇచ్చి ఆ డీ ఏ తోనే అన్ని పండుగలు చేసుకోవాలన్నట్లుగా ప్రభుత్వ వైఖిరి ఉందన్నారు. హఅంతే కాకుండా ప్రభుత్వ విధానాలతో సర్కారు బడుల నిర్వీర్యం అవుతున్నాయన్నారు.పాఠశాలల్లో బోధన కంటే బోధనేతర కార్యక్రమాలు ,మోయలేని పని భారం వల్ల ఉపాధ్యాయులు నాణ్య మైన విద్యను విద్యార్థులకు అందించి లేకపోతున్నారన్నారు. బోధనేతర కార్యక్ర మాలు ఉపాధ్యాయులకు అప్పచెప్పొద్దని ఆయన డిమాండ్ చేశారు.ఈసమావేశంలో జి సిహెచ్ జి శర్మ, ఏ చిన్నారావు, యుగం ధర్, అర్ ఎన్ రాజు, అప్పారావు, ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe