సంక్రాంతికి గ్రామీణ ప్రజలకు గుడ్ న్యూస్!

గ్రామాలకు అన్న క్యాంటీన్ విస్తరణ – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పేదలు, కూలీలు, గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. ఈ మేరకు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో త్వరలోనే 70 కొత్త అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు.

ఈ క్యాంటీన్లలో తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందించనుండగా, ముఖ్యంగా రోజువారీ కూలీలు, పేద కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇప్పటికే పట్టణాల్లో లక్షల మందికి అండగా నిలిచిన అన్న క్యాంటీన్ పథకం, ఇప్పుడు గ్రామాలకు విస్తరించడం విశేషం.

WhatsApp Join Now
Youtube Subscribe