కుప్పం జనవరి17/ఎల్లోసింగం
భారత చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహానుభావుడు, విజయనగర సామ్రాజ్య మహాసామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు గారి 555వ జయంతిని ఘనంగా కుప్పంలో జరుపుకోవడం మనకు గర్వకారణం. ఈరోజు శనివారం శ్రీకృష్ణదేవరాయల జయంతిని పురస్కరించుకుని కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఓ గొప్ప యోధుడే కాదు; ఆయన దూరదృష్టి గల పాలకుడు, సాహిత్య పోషకుడు, ప్రజాహిత పరాయణుడు. యుద్ధరంగంలో ఆయన అపార విజయాలు సాధించారు. ఉమ్మడి దక్షిణ భారతాన్ని ఏకతాటిపైకి తెచ్చి, విదేశీ ఆక్రమణల నుంచి దేశాన్ని రక్షించారు. కానీ ఆయన గొప్పతనం కేవలం ఖడ్గంలోనే కాదు – కరుణలో, న్యాయపాలనలో, ప్రజల సంక్షేమంలో కూడా ఉంది. “ప్రజలే రాజ్యానికి ప్రాణం” అనే భావనతో పాలన సాగించిన అరుదైన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ,కుప్పం నియోజకవర్గం ఇంచార్జ్..ఏపీఎస్ ఆర్టీసీ ఉపాధ్యక్షులు పి ఎస్ మునిరత్నం , పీఎంకే ఉడా చైర్మన్ సురేష్ బాబు ,మరియు రెస్కో చేర్మెన్ , ఎఎంసి చైర్మన్ ,టీటీడీ బోర్డునంబర్ ,కడ సభ్యులు, మున్సిపాలిటీ ఛైర్మెన్ ,కుప్పం నియోజకవర్గ 5 మండల పార్టీ అధ్యక్షులు, మరియు రాష్ట్ర డైరెక్టర్స్, రెస్కో డైరెక్టర్స్ ,ఎఎంసి డైరెక్టర్స్ ,మున్సిపల్ కౌన్సిలర్స్ , మరియు క్లస్టర్ ఇంఛార్జీలు & యూనిట్ ఇంఛార్జీలు, తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
