శ్రామికుల సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తాం .

రుద్రవరం. జనవరి, 17,
( ఎల్లో సింగం ప్రతినిధి )

శ్రామికుల సంక్షేమ కోసం నిరంతరం శ్రమిస్తామని మిత్రమా సేవా సమితి అధ్యక్షుడు గోవిందరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని
ఆలమూరు గ్రామంలో మిత్రమా సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన శ్రామికులు లేబర్ కార్డు మరియు ఈ శ్రమ కార్డు కొరకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలమూరు గోవిందరెడ్డి మాట్లాడుతూ ఈరోజు మా మాటలను గౌరవించి తమను నమ్ముకున్న తల్లిదండ్రుల కొరకు భార్య పిల్లలకు కొంతవరకైనా భవిష్య త్తు నిధిని ఇవ్వాలనే ఆకాంక్షతో ఒక మంచి దృఢమైన సంకల్పంతో తమ కుటుంబ బాధ్యతతో పాటు తోటి వారికి కాస్తయినా సేవ చేయాలని లక్ష్యసాధనలో భాగంగా ఆలమూరు గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు చిలక రమణయ్య, కోలా మహేష్, సయ్యద్ హుస్సేన్, కందుకూరి సుబ్బయ్య , గోరే భాష, మరియు వివిధ రంగాలకు చెందిన శ్రామికులు లేబర్ కార్డు, ఈ శ్రమ కార్డ్ కొరకు దరఖాస్తులు చేయించడం జరిగిందన్నారు. నేటి నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రజలందరి వద్దకు వెళ్లి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ప్రతి శ్రామికుడికి ఈ శ్రమ కార్డు లేబర్ కార్డు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం పరంగా ఎటువంటి సంక్షేమ పథకాలు లభిస్తాయి, అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి లబ్ది చేకూరుతుంది అన్న విషయాలు పూర్తిగా ప్రతి పౌరుడికి అవగాహన కలిగేలా ప్రతి శ్రామికుడు ఈ కార్డులను నమోదు చేసుకునేలా మా వంతు సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మిత్రమా సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe