గౌరవనీయులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ మరియు ఆత్మకూరు మండల ఇంచార్జ్ ధర్మవరపు బాలాజీ ఆదేశాల మేరకు దాతల సహకారంతో వై కొత్తపల్లిలోని శ్రీ మలహోబిల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, వై కొత్తపల్లి వద్ద ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శనివారం ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన గంగుల ఓబిరెడ్డి దంపతులు, అలాగే వై కొత్తపల్లి గ్రామానికి చెందిన సాకే సాయినాథ్ దంపతుల ఆర్థిక సహకారంతో కార్యక్రమం జరిగింది. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవదాస్ గారికి, అర్చకుడు పరంధామయ్య గారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
వై కొత్తపల్లి మలహోబిల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శనివారం అన్నప్రసాద వితరణ
14
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
