విద్యుత్ స్తంభం మార్పు
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం గ్రామంలో చేనేతల గల్లి సమీపంలోని రోడ్డును ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి సూచన మేరకు అభివృద్ధి చేయుటకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్చే కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది.
గ్రామ ప్రజల సమస్యను గుర్తించి, గ్రామ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కరెంట్ ఏడీఈ పెరుగు శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ చూపి విద్యుత్ స్తంభం మార్పునకు అవసరమైన చర్యలు తీసుకొని సహకరించారు.
ఈ కార్యక్రమంలో ఏడీఈ గారు సంబంధిత అధికారుల సహకారంతో పాటు గ్రామానికి చెందిన నాసిక భద్రయ్య, భార్గవ, సుబ్బారావు తదితరుల సహాయంతో వారి చెరువు ప్రాంతం గుండా విద్యుత్ స్తంభాన్ని సురక్షితంగా మార్చారు. ఈ పనికి డీఈవో గారు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించారని గ్రామస్తులు తెలిపారు.
రోడ్డు అభివృద్ధికి అడ్డంకి తొలగిపోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులకు మరియు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ఏడీఈ పెరుగు శ్రీనివాసరావు గారితో పాటు సంబంధిత అధికారులను సన్మానించారు.
వేటపాలెంలో రోడ్డు అభివృద్ధికి సహకారం
22
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
