వేటపాలెంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు



‎దేశానికి స్వాతంత్ర్యాన్ని, ప్రపంచానికి అహింసా మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వేటపాలెం మండలం పంచాయతీ కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
‎ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య గారు , గ్రామ పార్టీ అధ్యక్షులు పోతురాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుల బాలకృష్ణ, వేటపాలెం మండల మహిళా అధ్యక్షురాలు బుర్ర కవితతో పాటు గాయత్రి, దుర్గా మల్లేశ్వరి,మండల తెలుగు యువత అధ్యక్షులు నాగు, మస్తాన్, పార్థసారథి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలు, స్వాతంత్ర్య పోరాటాల ప్రాధాన్యతను వారు గుర్తు చేశారు. అలాగే గాంధీజీ చేతి కర్ర వదిలి వెళ్లి వేటపాలెం సందర్శించి ఇక్కడి గ్రంథాలయ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

WhatsApp Join Now
Youtube Subscribe