విశాఖపట్నం నుండి బంగారు వలస ఆర్టిసి బస్సు పునరుద్ధరించాలి

విశాఖపట్నం నుండి బంగారు వలస వరకు గతంలో నడిపే ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని వంగర మండల ప్రజానీకం కోరుతున్నారు. గతములో నడిపే ఈ ఆర్టీసీ బస్సునుచీపురుపల్లి సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి పాడవడంతో ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఆర్టీసీఅధికారులు రద్దు చేశారు. అప్పట్లో ఆ బస్సు బంగారువలస నుండి ఉదయం బయలుదేరి విశాఖపట్నం సుమారుగా 10 గంటలకు చేరుకుండేది. అప్పట్లో ఆర్ టి సి బస్సు ఉదయం బంగారు వలసలో బయలుదేరడంతో రోగులు ఉద్యోగులు వ్యాపారస్తులకు ఎంతగానో ఉపయోగపడేది రెండు సంవత్సరాలు నుండి ఆర్టీసీబస్సు రద్దు కావడంతో మండల ప్రజానీకం చాలా ఇబ్బంది గురవుతున్నారు. చీపురుపల్లి సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో రాజాం నుండి విశాఖపట్నం కి చీపురుపల్లి మీదగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి విశాఖపట్నం నుండి బంగారు వలస వరకు గతం లో నడిపినటువంటి ఆర్టీసీ బస్సుసర్వీసును మరలా ఆర్టీసీ బస్సును నడపాలని వంగర మండల ప్రజానీకం కోరుతున్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులుఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రయాణికుల కష్టాలను గట్టెక్కించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వంగర మండలం నుండి విశాఖపట్నం చేరుకోవాలంటే సుమారుగా 6గః:సమయం పడుతుందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అదే ఆర్టీసీ బస్సునువంగర మండలం నుండి ఆర్టిసి బస్సు సౌకర్యం విశాఖపట్నం వరకు నడిపినట్లయితే వంగర మండలం నుండి సుమారుగా నాలుగు గంటల టైంలో విశాఖపట్నం చేరుకోగలమని ప్రజానికం ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe