ఆంధ్రప్రదేశ్ సాగర తీర నగరం విశాఖపట్నం ఇప్పుడు కేవలం సముద్రతీర నగరంగా కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా అవతరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డేటా సిటీ ఏర్పాటు కోసం బృహత్తర ప్రణాళికను రూపొందించింది. సముద్రగర్భ కేబుల్ కనెక్టివిటీ ద్వారా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అందించడం, హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు, సర్వర్ తయారీ యూనిట్లు, ఆధునిక కూలింగ్ సిస్టమ్‌ల ఏర్పాటు, 100 కిలోమీటర్ల వ్యాసార్థంలో పూర్తి డేటా పర్యావరణం నిర్మాణం వంటి ప్రత్యేకతలు విశాఖ AI సిటీ ప్రత్యేకత. ఇప్పటికే గూగుల్, రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్ వంటి సంస్థలు భారతదేశంలో తమ AI మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నం ప్రపంచ AI మార్కెట్‌లో అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలకు పోటీ ఇచ్చే స్థాయిలో మలచబడుతుంది. AI, IT, తయారీ రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. విశాఖ AI సిటీ భవిష్యత్తులో భారతదేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో కీలక కేంద్రంగా నిలిపే అవకాశం ఉంది.
విశాఖపట్నం గ్లోబల్ AI హబ్‌గా: దేశంలోనే తొలి AI డేటా సిటీ ఏర్పాటు!
16
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
