విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యాసంస్థల యాజమాన్యాలు.

ఫిట్నెస్ లేని కారణంగానే ఈ ఆక్సిడెంట్ జరిగింది.

విద్యార్థుల వైద్యం మొత్తం కాలేజ్ యాజమాన్యమే బాధ్యత వహించాలి.

ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసే కారుకులపై , కాలేజీపై చర్యలు తీసుకోవాలి.

,డి వై ఎఫ్ ఐ , ఏఐ.ఎస్.ఎఫ్, పి డి ఎస్ యు , డి ఎస్ ఎస్ ఐ.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీల డిమాండ్

మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తున్న కేఎల్ఆర్ ప్రైవేట్ విద్యాసంస్థ బస్సు మొండికుంట సమీపంలో ప్రమాదానికి గురైందనీ ప్రమాదంలో సుమారు 60 మంది గాయపడ్డారనీ ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందనీ గాయపడ్డ విద్యార్థులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పొందుతున్నారనీ , భవిష్యత్తులో వారికి మెరుగైన వైద్యం అందించడం కోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని విద్యార్థి, యువజన సంఘాల జిల్లా కార్యదర్శులు అన్నారు.
ఈ సందర్భంగా గాయపడిన విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించిన జిల్లా కార్యదర్శులు మునిగేలా శివ ప్రశాంత్, అభిమన్యు, కాళంగి హరిక్రిష్ణ ,అజిత్, ప్రణయ్, విజయ్ అన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ

విద్యార్థులు, విద్యార్థినిలు మణుగూరు పరిసర ప్రాంతాల నుండి ఎంతో ఆశతో చదువుకోవాలని విద్యార్థులు ప్రతిరోజు బస్సులో ప్రయాణం చేస్తున్నారని ఈరోజు ప్రమాదానికి గురికావడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్నెస్ లేని బస్సుల్ని గుర్తించకపోవడమే ఈ ఘటన కు కారణమని విద్యార్థులు ఆరోపణ చేస్తున్నారని ఆక్సిడెంట్ సమయంలో స్టీరింగ్ కూడా తిరగలేదని ఓ విద్యార్థి చెప్తున్నారు అని వారన్నారు. బస్సులోనే ఇంజనీరింగ్ విద్యార్థులు 60 మంది ఉండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వారికి మెరుగైన వైద్యం అందించాలనీ కాలేజ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మిగతా విద్యార్థుల వైద్యం కూడా కాలేజ్ యాజమాన్యమే భరించాలని వారన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని బస్సు యాక్సిడెంట్ కి కారణాలు ఏమిటో విద్యార్థులకు తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని పోలీస్ వారు విచారణ చేసి కారుకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని కళాశాలల బస్సులను ఫిట్నెస్ను మరోసారి పరిశీలించాలని, పరీక్షల వేల విద్యార్థుల పరిమితికి మించి బస్సులలో ప్రయాణం చేయించే బస్సులను సీజ్ చేయాలని
విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడితే ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని ఇలాంటి ఘటనలు పునరావతమైతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ అఖిల్ ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు భూపేందర్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe