విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత…

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-

పాఠశాలలో చదివే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తున్నదని బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న రామభద్రపురం మండలం నాయుడువలస గ్రామంలో ఆ గ్రామ పాఠశాల ఆంగ్ల భాషా పాఠశాల సహాయకులు జె సి రాజు అన్నారు. పాఠశాలలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఏ ఎన్ ఎమ్ భవాని ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాన్న భోజన అనంతరం విటమిన్ మరియు ఐరన్ మాత్రలను పంపినిచేసే కార్యక్రమాన్ని నిర్వహించారు జె సి రాజు విద్యార్థులకు మాత్రలను వేసి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రతివారం ఐరన్ మాత్రలను వేసుకోవాలన్నారు.తద్వారా రక్త హీనత బారిన పడకుండా ఉండవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త లక్ష్మీ, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe