వాల్మీకిపురంలో “TB ముక్త్ భారత్ 2.0” – క్షయవ్యాధి నిర్మూలనకు సమిష్టి కృషి

చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురం మండలంలో “TB ముక్త్ భారత్ 2.0” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. భారత ప్రభుత్వం చేపట్టిన National Tuberculosis Elimination Programme (NTEP) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం MPDO అధ్యక్షతన, మండల వైద్యాధికారి డాక్టర్ రిచర్డ్ వెస్లీ సమక్షంలో సాగింది. మండల స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, CHOలు, హెల్త్ సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది విశేషంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సమావేశంలో మండల పరిధిలో క్షయవ్యాధి కేసుల గుర్తింపు, అనుమానితులకు త్వరితగతిన పరీక్షలు, ప్రారంభ దశలోనే నిర్ధారణ మరియు పూర్తి చికిత్స ప్రాముఖ్యతపై విస్తృత చర్చ జరిగింది. వైద్యాధికారులు TB పూర్తిగా నయం కావచ్చని, సమయానికి చికిత్స తీసుకోవడం అత్యవసరమని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు బలోపేతం చేసి, ప్రతి అనుమానిత రోగిని పరీక్షలకు పంపేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మొదటిసారిగా ఫీల్డ్ స్థాయి ఎక్స్‌రే యంత్రం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సమీక్ష నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ లక్ష్య సాధనలో ప్రతి సిబ్బంది చురుకుగా వ్యవహరించాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది. “ఆరోగ్యకరమైన, TB-రహిత వాల్మీకిపురం మండలం” నిర్మాణం కోసం సమాజం భాగస్వామ్యం కీలకమని సమావేశంలో ఉద్ఘాటించారు.

WhatsApp Join Now
Youtube Subscribe