మధురవాడ: జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలోని 5వ వార్డులో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు శ్రీమతి మొల్లి హేమలత పరిశీలించారు. వార్డు లో బోరవానిపాలెం, మారికవలస, వికలాంగుల కాలనీ, సాయిరాం కాలనీ, బొట్టవానిపాలెం తదితర ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, పారిశుధ్య పనుల పురోగతిని ఆమె ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన పనులు వేగంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆమె తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్థానిక శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు సహకారం తో వార్డు అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా వార్డు పరిధిలో ప్రధాన రహదారులు కాలువలు, కొండవాలు ప్రాంతాల్లో మెట్ల మార్గాలు ఏర్పాటు తదితర సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని, ఇంకా కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందని అలాగే వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని కార్పొరేటర్ మొల్లి హేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, సీనియర్ నాయకులు బోయి శ్రీను, బోయి రమాదేవి, జనసేన నాయకులు సూరిబాబు, కంబపు కామరాజు, వర్క్ ఇన్స్పెక్టర్ రాజు, మద్దుల వీరభద్రం, స్థానిక నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
వార్డులో అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ మొల్లి హేమలత
31
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
