చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మూసివేతపై సోషల్ మీడియాలో కథనాలు వైరల్‌గా మారాయి. మార్కెట్ విలువ తగ్గడంతో కంపెనీని దశలవారీగా మూసివేసి ఒప్పోలో విలీనం చేయనున్నారన్న వార్తలు టెక్ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. దీంతో భారత్‌లోని వన్‌ప్లస్ వినియోగదారుల్లోనూ ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లియు స్పందించారు. ఇవన్నీ అసత్య ప్రచారాలేనని, భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
ఒకప్పుడు స్వతంత్ర బ్రాండ్‌గా గుర్తింపు పొందిన వన్‌ప్లస్, పోటీ పెరగడంతో బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ఒప్పో సబ్‌బ్రాండ్‌గా కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో విక్రయాలు, మార్కెట్ వాటా తగ్గినప్పటికీ కంపెనీ మూసివేతకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంస్థ స్పష్టంచేసింది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
