సరుకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఫీజుల పెంపుపై ఏపీ ప్రభుత్వ బ్రేక్
కేంద్ర ప్రభుత్వం పెంచిన సరుకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఫీజుల పెంపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఫీజులనే వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, ఈ అంశంపై ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని రవాణాశాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వాహన యజమానులు, ట్రాన్స్పోర్ట్ రంగానికి తాత్కాలిక ఊరట లభించింది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
