లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు

ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు ఆదేశాలతో ఒకరోజు ముందుగానే ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం తెల్లవారంగానే చీరాల నియోజకవర్గంలో ప్రారంభమైంది.

దేశాయిపేట పంచాయితీ ఆనుములపేట, వేటపాలెం గ్రామం పోలేరమ్మ టెంపుల్ దగ్గర, చీరాల మున్సిపాలిటీ 13వ వార్డు థామస్ పేట నందు శనివారం కూటమి నాయకుల తో కలిసి చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు పింఛన్ల పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..

చంద్రన్న మీ ఇంటికి నన్ను పంపారు మీకు ఒక రోజు ముందుగా పెన్షన్ ఇస్తున్నామని ప్రతి ఇంట్లో చిరునవ్వును చూడడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని లబ్ధిదారులతో అన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఒకటవ తేదీ పెన్షన్లను ఇస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని అవ్వ తాత చిరునవ్వుతో కూటమి పాలనలో ఒకటవ తారీకు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే 31 వ తారీకు పింఛన్లు పంపిణీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు.

కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో చీరాల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి ప్రాంతాలుగా మార్చుకునేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తుందని. నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు తీసుకు వెళ్తున్నామని. మౌలిక సదుపాయాల కల్పన, ఇంటింటికి కులాయి ఏర్పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కృషి జరుగుతుందన్నారు.అదేవిధంగా నియోజకవర్గంలో కూడా గ్రామ గ్రామాన అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు సచివాల సిబ్బంది పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe