రైల్వే కోడూరు, జనవరి 30 ఎల్లో సింగం ప్రతినిధి
రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన, రేపు పదవీ విరమణ చేయనున్న కళాశాల రికార్డు అసిస్టెంట్ శ్రీ చి. హెచ్. ఓబులేసు శుక్రవారం ఘనంగా సన్మాన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్ష ఉపన్యాసం చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఓబులేసు గారు ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ కళాశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. ఆయన సేవలు కళాశాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ, ఓబులేసు అందరితో మమేకమై కళాశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారని, ఈ కళాశాలకు ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు.సన్మాన గ్రహీత శ్రీ చి. హెచ్. ఓబులేసు మాట్లాడుతూ, రేపు పదవీ విరమణ చేయడం ఒక వైపు సంతోషంగా ఉన్నప్పటికీ మరో వైపు బాధగా ఉందన్నారు. ఇంత మంచి కళాశాలలో 42 సంవత్సరాల పాటు ఉద్యోగం చేయడం తన అదృష్టమని పేర్కొంటూ, తన సేవా కాలంలో ఎన్నో అనుభవాలు పొందానని తెలిపారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు కలిసి శ్రీ చి. హెచ్. ఓబులేసు గారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, ఓబులేసు గారి స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
