రిటైర్మెంట్‌కు రెండేళ్ల ముందే సర్వీస్ వెరిఫికేషన్ తప్పనిసరి.

రిటైర్మెంట్‌కు రెండేళ్ల ముందే సర్వీస్ వెరిఫికేషన్.
పెన్షన్ ప్రక్రియలో ఆలస్యాన్ని నివారించేందుకు ఆర్థిక శాఖ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
దీనివల్ల ఉద్యోగులు పదవీ విరమణ పొందే సమయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయోజనాలు అందుతాయి.
ముఖ్య అంశాలు: ▪️ముందస్తు వెరిఫికేషన్ : పదవీ విరమణ తేదీకి రెండేళ్ల ముందే సర్వీస్ వివరాల ధ్రువీకరణ (Verification) తప్పనిసరి.
▪️డిజిటలైజేషన్ : రిటైర్మెంట్ ప్రయోజనాల ప్రక్రియను సులభతరం చేసేందుకు ‘నిధి’ (Nidhi) పోర్టల్ ద్వారా డిజిటలైజ్ చేస్తున్నారు.
▪️కామన్ అప్లికేషన్ ఫాం:పోర్టల్‌లోని ఈ ఫాం ద్వారా దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తారు.
▪️కాగిత రహిత ప్రక్రియ : సర్వీస్ రిజిస్టర్ మినహా మిగిలిన అన్ని భౌతిక పత్రాలను (Physical documents) మరియు మాన్యువల్ విధానాలను నిలిపివేస్తున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe