విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీల్లో నందలూరుకు చెందిన విజ్డం స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పతక వేట సాగించారు. విశ్వం ఈడుటెక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో సుమారు 950 మంది విద్యార్థులు పాల్గొనగా, విజ్డం స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి పాఠశాలకు, నందలూరు ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైన జాశ్రీత మణిశ్రీ అబాకస్ విభాగంలో రాష్ట్రస్థాయి 2వ ర్యాంకు సాధించగా, పి. శశాంత్ విజిలైజేషన్ విభాగంలో 3వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఈ విజయంపై కరస్పాండెంట్ వల్లిమి రాధ సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే ఈ ఘనతకు కారణమని తెలిపారు. మ్యాథ్స్ టీచర్ అనురాధతో పాటు తల్లిదండ్రులను కూడా పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.
రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో విజ్డం స్కూల్ ఘనవిజయం – నందలూరు విద్యార్థుల పతక వేట
14
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
