రామయ్యపుట్టుగలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పంపిణీ – బాధితులకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వ విప్ అశోక్‌బాబు

13-01-2026 తేదీన రామయ్యపుట్టుగ గ్రామంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా బాధితులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, గౌరవనీయులు డాక్టర్ శ్రీ బెందాళం అశోక్‌బాబు గారు ముఖ్యంగా పాల్గొని బాధితులను ఆదుకున్నారు. ఈ సందర్భంగా దుర్గాశి జానకమ్మకు రూ.40,000లు, మట్టా శ్రీరాములు గారికి రూ.81,700లు ఆర్థిక సాయంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పత్రి తవిటయ్య గారు, నందిగాం కోటేశ్వరరావు గారు, కాళ్ళ జైదేవ్ గారు, ఆశి ధర్మరాజు గారు, దుర్గాశి వాసుబాబు రెడ్డి గారు, దుర్గాశి శంకర్ రెడ్డి గారు, దుక్క లక్ష్మణ్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో హాజరై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ తెలుగుమహిళా ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్ ఆశి లీలారాణి మాట్లాడుతూ, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రభుత్వ విప్ డాక్టర్ అశోక్‌బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సహాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తోందని ఆమె పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe