రామగిరి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు.

రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ మరియు ధర్మవరం టిడిపి ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు రామగిరి మండలంలో MY TDP యాప్‌ను ఆవిష్కరించారు. పార్టీ కార్యకలాపాల బలోపేతం, కార్యకర్తలను నేరుగా పార్టీతో అనుసంధానం చేయడం, ప్రజా సమస్యలను తక్షణమే పార్టీ దృష్టికి తీసుకురావడం లక్ష్యంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

రామగిరి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు పరంధామ యాదవ్, రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయపాటి సుధాకర్ నాయుడు, జిల్లా TNSF ఉపాధ్యక్షులు నాగేశం నాయుడు, కనగానపల్లి కన్వీనర్ పోతులయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఆవుల ముత్యాలప్ప, మాజీ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాసులు, యూనిట్ ఇన్‌చార్జ్ గుర్రం శ్రీనివాసులు, గ్రామ కమిటీ అధ్యక్షులు కే విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు MY TDP యాప్‌ను డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పార్టీ పిలుపు మేరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తమ మొబైల్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని పార్టీ బలోపేతానికి సహకరించాలని నాయకులు కోరారు. పరిటాల కుటుంబం నాయకత్వంలో పార్టీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని వారు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe