బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
బొబ్బిలి మండలంలోని దిబ్బగుడివలస గ్రామంలో గురువారం ఎమ్మెల్యే బేబినాయన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తున్నారు.అందులో భాగంగా దిబ్బగుడివలస గ్రామ రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే బేబినాయన అందజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహ ణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, బొబ్బి లి ఆర్డీవో జే.వీ.ఎస్.ఎస్. రామ్మోహనరావు, తహసీల్దార్ ఎం శ్రీను, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, ఎంపీటీసీ వెన్నెల నాగరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
