శృంగవరపుకోట ఎల్లో సింగం ప్రతినిధి :- కొత్తవలస మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గల వార్డు నెంబర్ ఐదు సాయి నగర్ కాలనీ రైల్వే కాలనీకు ఆనుకొని ఉన్నందున దశాబ్దాలుగా రైల్వే స్థలం గుండా రాకపోకలు సాగిస్తున్నారు ఈ కాలనీవాసులకు మరో ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం రైల్వే కాలనీ రాకపోకలు సాగిస్తున్నారు కానీ శనివారం అకస్మాత్తుగా రైల్వే అధికారులు రహదారిని మూసి వేసేందుకు ప్రయత్నించడంతో కాలనీవాసులు మాకు ప్రత్యామ్నాయ మార్గం లేదని రహదారిని మూసి వేయొద్దని అభ్యర్థించడంతో పై అధికారుల ఆదేశాల ప్రకారంగా మేము పనులు చేస్తున్నామని చెప్పడంతో ఆదివారం ఉదయం కొత్తవలస పర్యటనకు వచ్చిన డిఆర్ఎంకు సాయి నగర్ కాలనీ వాసులు పిడబ్ల్యూఐ కార్యాలయంలో కలిసి రహదారి సమస్య పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు ఇదే సమస్యపై 2017లో అప్పటి విశాఖ పార్లమెంట్ ఎంపీ కంభంపాటి హరిబాబు శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి రైల్వే అధికారులతో చర్చించి రహదారి సమస్య లేకుండా అప్పుడు పరిష్కరించిన మళ్లీ రైల్వే అధికారులు ఇప్పుడు తోవల మోసివేస్తామనడంతో సాయి నగర్ రహదారి సమస్య లేకుండా చూడాలని రైల్వే అధికారులకు వినతి పత్రం ఇచ్చారు
రహదారి సమస్యను పరిష్కరించాలని రైల్వే డిఆర్ఎమ్ కు వినతి పత్రం ఇచ్చిన సాయి నగర్ కాలనీ వాసులు
01
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
