రసాయన వ్యర్థాల లోడ్‌ లారీ పంటకాలువలో బోల్తా

కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగర శివారులో పంట కాలువలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫార్మా కంపెనీ నుంచి సేకరించిన రసాయన వ్యర్థాలను తరలిస్తున్న లారీ బోల్తా పడటంతో ప్రమాదకర వ్యర్థాలు కాలువలో కలిసిపోయాయి. అక్కడ పంపింగ్‌ స్కీం ఉండటంతో నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ కాలువ నీరు ఏవీ నగరం, కొమ్మనాపల్లి, రావికంపాడు తదితర గ్రామాలకు చేరుతుండటంతో పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలు కాలువ నీటిని తాగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పరిసర చెరువుల్లోకి కూడా కాలుష్యం చేరే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య ఘటనను సమీక్షించి ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు.

WhatsApp Join Now
Youtube Subscribe