- రక్తాన్ని తయారు చెయ్యలేం, కేవలం దానం చేయగలం..!
• రక్తదానం చేద్దాం-చెయ్యడాన్ని ప్రోత్సహిద్దాం
• స్వాస్ సేవా సంఘం అధ్యక్షులు బూర్లె.పైడినాయుడు
విజయనగరం న్ విన్ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ మాళవిక జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఎన్విన్ బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పౌర వేదిక అధ్యక్షులు భీశెట్టి బాబ్జి, ప్రముఖ వైద్య నిపుణులు సుఖీభవ హాస్పిటల్ అధినేత పి వి ఎస్ రామారావు పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో స్వాస్ సేవా సంఘం సభ్యులు నెల్లిమర్ల కు చెందిన పాలూరి.సీతారాం(నెల్లిమర్ల సీతారాం బేకరి)మెయిద జంక్షన్ నుంచి వచ్చి విజయనగరం న్ వి న్ బ్లడ్ బ్యాంక్ లో డొనేట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాస్ సేవా సంఘం అధ్యక్షులు బూర్లె.పైడినాయుడు మాట్లాడుతూ రక్తాన్ని తయారు చేయలేం కేవలం దానం చేయగలం అని రక్తదానం చేద్దాం-చెయ్యడాన్ని ప్రోత్సహిద్దాం అని రక్తం అవసరం అనగానే రక్తదానం చేస్తున్న సభ్యులు మన స్వాస్ సేవా సంఘంలో ఉండటం మనకు చాలా అదృష్టం అని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది రక్తదానం వైపు అడుగులు వేస్తారని కోరుకుంటున్నాం అని శ్రీమతి మాళవిక కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, రక్తదాన శిబిరాన్ని నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ హిజ్రా అసోసియేషన్ దవడ కొండబాబు,విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ ఇల్తామస్,విజయనగరం పోలీస్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అనిల్, పౌరవేదిక సభ్యులు తుమ్మగంటి రామ్మోహన్, రవ్వ వెంకటేష్, ఇండియన్ బ్లడ్ బ్రదర్స్ జగదీష్, గణేష్, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి తాడేపల్లి నాగేశ్వరరావు, మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి గోపి,ప్రవీణ్,కళ్యాణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
