రంపచోడవరం హై స్కూల్ వద్ద క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జి రెడ్డి.

రంపచోడవరం జనవరి 10(ఎల్లో సింగం ప్రతినిధి): ఆటలు మానసికొల్లాసాన్ని కలిగిస్తాయని విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో మమేకమై ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. శనివారం రంపచోడవరం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఆయన విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు.కార్యక్రమంలో కాకి స్వామి, వీర మహిళా పండా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రిభన్ కట్ చేసి టాస్ వేసి ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల భోజ్జి రెడ్డి టోర్నమెంటును లాంఛనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు క్రికెట్ అభిమానులు వివిధ క్రికెట్ టీం కెప్టెన్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe