ఎమ్మెల్యే దగ్గుపాటి సూచనల మేరకు జయంతి వేడుకలు
సమాజంలో రుగ్మతలను పారద్రోలిన మహా కవి వేమన
వేమన జీవితం ఎంతో మందికి ప్రేరణ, స్ఫూర్తి.. టీడీపీ నేతలు
తన పద్యాల ద్వారా సమాజాన్ని చైతన్యం చేసిన గొప్ప కవి యోగి వేమన అని.. అనంతపురం అర్బన్ టీడీపీ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచనల మేరకు పార్టీ కార్యాలయంలో వేమన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వేమన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఆ మహాకవికి నివాళులర్పించామన్నారు. యోగి వేమన సమాజంలో రుగ్మతలను తన పద్యాల ద్వారా పారద్రోలారన్నారు. నేటికీ విశ్వదాభిరామ వినురవేమ అన్న పద్యాలు వింటూనే ఉన్నామన్నారు. వేమన జీవితం ఎంతో మందికి ప్రేరణ, స్ఫూర్తి అని టీడీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ, టిడిపి జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి కంఠాదేవి, క్లస్టర్ ఇంచార్జ్ లు సరిపూటి రమణ, కాయగూరల శ్రీధర్, గోపాల్ గౌడ్, పొట్లూరి కేశవ నాయుడు, రాజారావు, డైరెక్టర్లు కడియాల కొండన్న, పరమేశ్వర్, కార్పొరేటర్ బాలాంజనేయులు, టిడిపి నగర కార్యదర్శి హరికృష్ణ, టిడిపి నాయకులు నెట్టెం బాలకృష్ణ, ఈడిగ నాగభూషణం, బాలా, దాడి రమేష్, ఇస్మాయిల్, కరీం, బోయ రాము, ఐ టిడిపి మధు, రామకృష్ణ, దాదా ఖలందర్, బళ్లారి గోపాల్ టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
