మొన్న సింగయ్య.. నేడు రాంబాబు.. జగన్ బయటకు వస్తే శవాలు లేవాల్సిందే..

వైకాపా అధినేత జగన్ పర్యటన సమయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయల్దేరిన జగన్ పర్యటన నేపథ్యంలో, జోగి రమేష్ ఇంటి సమీపంలో వైకాపా చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు డి. రాంబాబు అకస్మాత్తుగా కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటన అనంతరం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైకాపా కార్యకర్తలు గుంపులుగా రోడ్లపైకి వచ్చి హంగామా సృష్టించారు. రింగురోడ్డు సహా పలు ప్రాంతాల్లో బైక్ స్టంట్లు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించారు. అక్కడే ఉన్న జోగి రమేష్ సహా పలువురు నేతలు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

WhatsApp Join Now
Youtube Subscribe