మేడారం జాతరకు వెళ్లే మహిళలకు శుభవార్త

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మరో 10 రోజులు మాత్రమే ఉండటంతో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జాతరకు సంబంధించి టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. జాతర కోసం నడపనున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్న విషయాన్ని అధికారులు ధృవీకరించారు. ఉచిత బస్సు సౌకర్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, సాధారణ బస్సులతో పాటు ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే నేపథ్యంలో ప్రత్యేక బస్సులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.

WhatsApp Join Now
Youtube Subscribe