మీరు విన్నవించిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాం….

సమస్య మీది పరిష్కారం మాది..

ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

గ్రామంలో ఏ సమస్య వచ్చినా తెలియజేసిన వెంటనే పరిష్కారం చూపిస్తానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. శుక్రవారం సీతానగరం మండలం కోటసీతారాంపురం గ్రామంలో పర్యటించిన ఆయనకు ప్రజలు ఇళ్ల స్థలాలు, ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, బ్యాంకు రుణాలు వంటి సమస్యలపై వినతులు అందించారు. ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే ఆయా శాఖల అధికారులతో తక్షణమే మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ముందుండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe