సభ్యులను పరామర్శించిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
చిట్వేలి, జనవరి 21: ఎల్లో సింగం ప్రతినిధి
రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటి వెంకటేశ్వర ప్రసాద్ చిత్రపటానికి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఇటీవల ప్రసాద్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం చిట్వేలి పట్టణంలోని ఆయన స్వగృహంలో జరిగిన దశదిన కర్మక్రియల కార్యక్రమంలో విశ్వనాథ నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కస్తూరి విశ్వనాథ నాయుడు మాట్లాడుతూ.. గుంటి వెంకటేశ్వర ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన మృతి నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు.ఈ నివాళి కార్యక్రమంలో విశ్వనాథ నాయుడు గారితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల సుబ్బరాయుడు (లారీ), బాలు రామాంజులు నాయుడు పాల్గొన్నారు. మరియు రాజంపేట పార్లమెంట్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు తేనేపల్లి చిన్న, విశ్రాంతి కస్టమ్స్ అధికారి కనకాద్రి, దళిత నాయకులు అద్భుత కుమార్, శేషయ్య, సుబ్బారావు, యువ నాయకులు కస్తూరి శివతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.
