మహాశివరాత్రి వేళ శ్రీశైల మల్లన్నకు తలపాగా – చేనేత మగ్గంపై నేత నేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మల్లన్నకు సమర్పించే పవిత్ర తలపాగా వస్త్రం చేనేత మగ్గంపై ప్రత్యేకంగా నేయబడింది. చేనేత రంగానికి చెందిన దేవాంగ సామాజిక వర్గం తరఫున సమర్పించే ఈ తలపాగా వస్త్రాన్ని చీరాల శాసనసభ్యులు శ్రీమద్దులూరి మాలకొండయ్య స్వయంగా మగ్గంపై నేసి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. సంప్రదాయ చేనేత కళకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం స్థానిక వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి కుమారులు శ్రీ మద్దులూరి గౌరీ అధర్నాథ్ దేశాయిపేట నుండి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి బయలుదేరే వాహనాన్ని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ప్రారంభించారు. వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ వేడుకలు బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం మరియు శ్రీశైల దేవస్థాన తలపాగా కార్యక్రమ వర్కింగ్ ప్రెసిడెంట్ భూసం శ్రీనివాసరావు, హస్తినాపురం బట్ట సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, గ్రామ సభ్యులు, కూటమి నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ తలపాగా సమర్పణ మహాశివరాత్రి సందర్భంగా విశేష భక్తి భావాన్ని ప్రతిబింబించింది.

WhatsApp Join Now
Youtube Subscribe