మరోసారి ఆకాశాన్నంటిన బంగారం ధరలు

హైదరాబాద్‌లో బంగారం ధరలు బుధవారం మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తొలిసారిగా రూ.1.50 లక్షల మార్క్‌ను దాటి, మరింత ఉద్ధృతంగా పెరిగింది. బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం రాత్రి రూ.1,52,800గా ఉన్న ధర, ఒక్కరోజులోనే రూ.6,000కు పైగా పెరిగి రూ.1,59,000కు చేరింది. అదే సమయంలో వెండి ధర కూడా కిలో రూ.3,19,000ను అధిగమించింది.

WhatsApp Join Now
Youtube Subscribe