మన్యం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో శతశాతం సుఖ ప్రసవాల లక్ష్యం – కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి

మన్యం: జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో శతశాతం సుఖ ప్రసవాలు జరగాలని, సీజీరియన్ అవసరాలు తగ్గించడంలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని వైద్యులను ఆదేశించారు. ప్రతి ఆసుపత్రి “ఏ+ గ్రేడ్” సాధించి, ప్రాంగణాలు హాయిగా, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రులలోని పరికరాలు సరైన పద్దతిలో వినియోగింపచేయాలని సూచించారు. ప్రతీ ఆసుపత్రిలో ప్రసవాల శిక్షణ, ప్రముఖ గైనకాలజిస్టుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, నర్సరీ, పూల మొక్కలు, గ్రీన్ పెన్సింగ్ వంటి సౌందర్య కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. అన్ని సదుపాయాలు సమకూర్చి, “నో పేపర్, నో పెన్” విధానంలో ఆన్‌లైన్ సేవలు అందించాలని, వైద్యులు రోగులతో ప్రేమగా, హృదయపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామస్థాయి అవగాహన, వాలంటీర్ సేవలను ప్రోత్సహించి, ప్రతీ రోగికి ఉచిత మెరుగైన వైద్యం అందేలా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

WhatsApp Join Now
Youtube Subscribe