చిత్తూరు జనవరి 15/ఎల్లోసింగం
నారావారిపల్లెలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూరు నారావారి పల్లెకు విచ్చేసి, సాంప్రదాయాలను గౌరవిస్తూ..,మరక సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకున్న , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని, గురువారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు , సీఎం స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, సంక్రాంతి పర్వదినం వైశిష్ట్యాన్ని తాను ఆచరిస్తూ.. భావితరాలకు తెలియజేస్తున్న
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారని ఎంపీ దగ్గుమళ్ళ కొనియాడారు.
అలాగే నారావారి పల్లెలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్ మోహన్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మనసా.. వాచా.. కర్మణా దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.
చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తో పాటు ముఖ్యమంత్రి గారిని కలిసిన వారిలో టిడిపి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు షణ్ముఖ రెడ్డి , చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని , పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ , చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ,నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ , శాప్ చైర్మన్ రవి నాయుడు , టీడీపీ సీనియర్ నేత చంద్రప్రకాష్ ఉన్నారు.
