మకర సంక్రాంతి వేళ… పల్లెసీమల్లో వెల్లివిరిసిన సంక్రాంతి హేళ!

బనగానపల్లెలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

యాగంటి క్షేత్రంలో సంక్రాంతి శోభ

అంగరంగవైభవంగా ముగిసిన స్వామివారి పార్వేట ఉత్సవం,,

బనగానపల్లె, జనవరి, 16,
( ఎల్లో సింగం ప్రతినిధి )

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ సంబరాలను బనగానపల్లె మండలంలో గ్రామ గ్రామాన ఆయా గ్రామ ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకున్నారు. మూడు రోజుల సంక్రాంతి పండుగ నేపథ్యంలో పల్లె పల్లె సీమల్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి గురువారం మకర సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు నూతన వస్త్రాలు ధరించి, తీపి వంటకాలు చేసుకుని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సాయంత్రం నూతన వస్త్రాలు గురించి గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి తమ ఇష్టదైవవాలను కొలుచుకుని పూజలు చేశారు. బనగానపల్లె లోని అవుకు మెట్ట వద్ద మారెమ్మ గుడికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతు సంఘం ఆధ్వర్యంలో కోట్నాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు మేళ తాళాల మధ్య ఊరేగింపుగా గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. స్థానిక బోయపేటలోని బంగారమ్మ ఉత్సవ విగ్రహాన్ని స్థానిక ప్రజలు పల్లకిపై ఊరేగించి గ్రామోత్సవం జరిపారు.

యాగంటి క్షేత్రంలో సంక్రాంతి శోభ

ఎర్రమల కొండల పర్వతసానువుల్లో స్వయంభుగా విగ్రహరూపన వెలసి భక్తులకు కొండంత అండగా ఉంటూ భక్తులకు తన ఆశీస్సులు అందించే యాగంటి శ్రీఉమామహేశ్వరస్వామి దంపతులు తామే స్వయంగా మాఘమాసంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ తానే స్వయంగా కొండ దిగిరావడం యాగంటి క్షేత్రం లో అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఎర్రమల కొండల్లో పర్వతసానువుల మధ్య వెలసి గర్భాలయంలో నిత్యమూ విశేష అలంకారాలతో, అభిషేకాలతో పూజలందుకునే శ్రీ ఉమామహేశ్వరస్వామి దంపతులు మకర సంక్రాంతి రోజున ఉత్సవమూర్తుల రూపంలో గురువారం కొండదిగి వచ్చారు. మాఘ మాసంలో మహా శివరాత్రి పండుగ రోజున జరిగే శివపార్వతుల కల్యాణం తిలకించేందుకు తమను నిత్యము ఆరాధించే పాతపాడు, మీరాపురం, సాదుకొట్టం, యాగంటిపల్లె, మాదాసుపల్లె గ్రామ ప్రజలను పెళ్లికి ఆహ్వానిస్తూ ప్రతియేటా పార్వేటగా పల్లకిలో ఆయా గ్రామాలకు వెళ్లడం శతాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది.
ఇలా తమ వివాహ వేడుకలకు ఆయకట్టు గ్రామాల ప్రజలను తమ పెళ్ళివేడుకలకు ఆహ్వానిస్తూ ఆ అదిదంపతులు స్వయంగా కొండదిగి రావడం నిజంగా ఈ ప్రాంత ప్రజల అదృష్టం. అలాగే .గ్రామస్తులు కూడా ఉమామహేశ్వరిని తమ ఇంటి అడపడుచుగా భావిస్తూ అదిదంపతుల రాకను గ్రామోత్సవం పేరిట అత్యంత వేడుకగా జరుపకుంటారు. మకర సంక్రాంతి రోజు వేకువజామున గర్భగుడిలో స్వయంభూగా విగ్రహరూపంలో వెలసిన శ్రీ స్వామివారికి ప్రత్యేకఅభిషేకాలు, ప్రత్యేక పూజలు అనంతరం ఆలయంలోని ఉత్సవమూర్తులను విశేష అలంకరణచేసి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ వెలుపల ప్రత్యేకంగా సిద్ధంచేసిన పూలపల్లకిలో కొలువుంచుతారు. ఆలయ ఈవో ,సహయ కమిషనర్ డి, పాండురంగారెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ బండి మౌళీశ్వర రెడ్డి,
పాతపాడు సర్పంచ్ బెడదల మహేశ్వరరెడ్డి, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో అలయ పూజారులు మహేష్ శర్మ, చిరంజీవి శర్మ,దేవేంద్ర శర్మ, రాఘవేంద్రశర్మలు స్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. పూజలనతరం పార్వేటలో భాగంగా పల్లకిని పాతపాడు, మీరాపురం, యాగంటిపల్లె మాదాసుపల్లె, సాదుకొట్టం గ్రామాల ప్రజలు, భక్తులు మంగళవాయిద్యాలతో కొండపై నుంచి కిందకుతీసుక వచ్చి కాలినడకన మూడు కిలోమీటర్ల దూరంలోని పాతపాడు వరకు తీసుకవచ్చారు. మధ్యాహ్నం పాతపాడు చేరుకున్న ఉత్సవమూర్తులు కొలువైన పల్లకిని పాతపాడు గ్రామస్తులు ఎదురేగి స్వాగతం పలికి ,పల్లకిని తాము అందిపుచ్చుకుని భక్తుల పూజలకు గ్రామ నడిబొడ్డున ఉన్న పెద్ద అరుగు వేదికపై ఉంచి పూజలు చేశారు. అనంతరము ఉత్సవమూర్తుల పల్లకిని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేశారు. పాతపాడులో స్వామివారి పార్వేట అనంతరం ఊరేగింపుగా బయలుదేరిన పల్లకిని గ్రామ మీరాపురం గ్రామ పొలిమేరలో గ్రామస్తులు ఆహ్వానం పలికి పల్లకిని తమ గ్రామానికి తోడ్కొని వెళ్లారు. మీరాపురంలో గ్రామోత్సవం అనంతరం యాగంటిపల్లె, సాదుకొట్టం, మాదాసుపల్లె,తిరిగి పాతపాడు చేరుకుంటుంది. రెండురోజుల పార్వేట ముగించుకుని స్వామివారి ఉత్సవమూర్తుల పల్లకి మళ్ళీ యాగంటి క్షేత్రానికి చేరుకోవడంతో పార్వేట కార్యక్రమం ముగిసింది.

WhatsApp Join Now
Youtube Subscribe