భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉత్సాహంగా ముగిశాయి. ప్రధాన సూచీలు బలమైన లాభాలను నమోదు చేశాయి.

సెన్సెక్స్ 650 పాయింట్లు ఎగసి 83,277 వద్ద ముగియగా, నిఫ్టీ 211 పాయింట్లు పెరిగి 25,682 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల షేర్లు కొనుగోళ్లతో మెరుగైన ప్రదర్శన కనబర్చాయి.

మార్కెట్‌లో సానుకూల ధోరణి కొనసాగడంతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచ మార్కెట్ల సంకేతాలు, దేశీయ ఆర్థిక అంచనాలు సూచీల పెరుగుదలకు దోహదపడ్డాయి.

WhatsApp Join Now
Youtube Subscribe