ఎల్లో సింగం న్యూస్ హోళగుంద జనవరి 18
ఆదివారం అమావాస్య సందర్బంగా దేవరగట్టు భక్తులతో కిటకిటలాడయని ఆలయ అర్చకులు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ మళమాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ తదితర విశిష పూజలు నిర్వహించినట్లు అర్చకులు మల్లయ్య స్వామి మహేష్ స్వామి తెలిపారు చిన్నరాలు కుంకుమ బండారు అట్టిస్తూ మెట్టు మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ గిరి పైకి ఎక్కారు ఓ వికలాంగుడు దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండను తన రెండు కట్టల సహాయంతో ఎక్కి శ్రీ మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ తరపున అన్నదాన్నం ఏర్పాటు చేశారు
