బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి దావా స్వాతి రమేష్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు 20-02-2026న మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా 34వ వార్డు అభివృద్ధికి సంబంధించి పలు సమస్యలను ప్రతిపాదిస్తూ వినతిపత్రం అందజేశారు. గత పాలనలో పరిష్కారం కాని అండర్ డ్రెయినేజీ సమస్యలు, కాలువలు నిండిపోవడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరడం వంటి అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రగతి కాలేజీ పరిసరాల్లో నీటి నిల్వలు, ప్రధాన రహదారులపై అక్రమ నిర్మాణాలు, అనధికారిక వ్యాపారాల వల్ల రాకపోకలకు కలిగే ఆటంకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాలువలపై ఏర్పడిన షాపులు, రహదారుల ఆక్రమణల తొలగింపుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా కూల్చివేతలు చేపట్టాలని అభ్యర్థించారు. స్థానిక ప్రజల సౌకర్యం, పట్టణ అభివృద్ధి దృష్ట్యా చైర్మన్ తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తమైంది. పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
“బెల్లంపల్లిలో మున్సిపల్ చైర్మన్ దావా స్వాతి రమేష్‌కు శాలువ సన్మానం – 34వ వార్డు అభివృద్ధిపై వినతిపత్రం”
20
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
