బూతుల నేతలను దండించాల్సిన జగన్.. పరామర్శ పేరుతో డ్రామాలు చేస్తున్నాడు

• 30నిమిషాల్లో పట్టే, 34 కిలో మీటర్ల ప్రయాణాన్ని జగన్ రెడ్డి 9 గంటలు సాగించింది మునిగిపోతున్న వైసీపీని కాపాడుకోవడానికి విఫల ప్రయత్నమే

• ప్రజాబలం లేని జగన్ పరామర్శ యాత్రను టీవీ సీరియల్ మాదిరి సాగదీశాడు

• జగన్ జంగిల్ రాజ్ పాలనను చూసే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించారు

• ప్రజా సమస్యలను రోడ్లపై కాదు.. దమ్ముంటే అసెంబ్లీ చర్చించుకుందాం రండి జగన్ మోహన్ రెడ్డి?

— కింజరాపు అచ్చెన్నాయుడు

జగన్మోహన్ రెడ్డి గుంటూరు రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘిస్తూ జంగిల్ రాజ్ మాదిరి ప్రవర్తించాడు. తాడేపల్లి నుంచి గుంటూరుకు 34 కిలోమీటర్లే.. 30 నిమిషాల్లో వెళ్లాలి. కానీ జగన్ మాత్రం 9 గంటలు ప్రయాణించాడు. మునిగిపోతున్న వైసీపీని కాపాడుకోవడానికి జగన్ విఫల ప్రయత్నం చేస్తున్నాడు. తిరుగు ప్రయాణం మాత్రం 30 నిమిషాల్లోనే చేశాడు. ప్రజాబలం లేని జగన్ పరామర్శ యాత్రను టీవీ సీరియల్ మాదిరి సాగదీశాడు. అసభ్యంగా బూతులు మాట్లాడిన వారికి మద్దతుగా రాష్ట్ర బంద్ చేస్తామంటున్న జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని ప్రజలు బంద్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. వైసీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా జగన్ ఇవాళ గుంటూరులో నానాయాగి సృష్టించాడు. దాడులు, అల్లర్లు, విధ్వంసాలను తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ప్రోత్సహించదు. మరీ ముఖ్యంగా అభివృద్ధికి బ్రాండ్ గా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అస్సలు ప్రోత్సహించరు. రెండు రోజుల క్రితం అంబటి చేసిన మురికి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని మా పార్టీ నాయకులు వాళ్ల ఇంటికి వెళ్లి డిమాండ్ చేస్తే.. దానిని దాడిగా వైసీపీ క్రియేట్ చేసింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని మా పార్టీ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు గారు సైతం తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి చెందుతున్న మన ఆంధ్రప్రదేశ్ లో హింసా రాజకీయాలకు, కక్ష సాధింపులకు తావులేదు. ఈ ఘటనలో మా పార్టీకి చెందిన వారిపైనే 31 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవాళ తన మంది మాలబల్యంతో గుంటూరు రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘిస్తూ జంగిల్ రాజ్ మాదిరి ప్రవర్తించాడు. వైసీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రయాణం సాగించారు. బెంగళూరు ప్యాలస్ కు పరిమితమైన జంగిల్ రాజ్… నేడు గుంటూరుకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడు. అడుగడుగునా ట్రాఫిక్ ఉల్లంఘిస్తూ.. సాక్షి మీడియాకు ఫోజులు ఇస్తూ.. బూతుల నేత ఇంటికి పరామర్శకు బయల్దేరాడు. మాజీ సీఎంగా పని చేసిన జగన్మోహన్ రెడ్డి.. బూతుల నేతలకు చీవాట్లు పెట్టాల్సింది పోయి.. వారికి సంఘీభావం తెలుపుతున్నాడు. గతంలో గంజాయి, కల్తీ మద్యం కేసుల్లో అరెస్టైన వారిని పరామర్శించిన జగన్.. నేడు బూతుల నేతలకు సంఘీభావం తెలుపుతున్నాడు. 2019-24 మధ్య కాలంలో జగన్.. ఆయన చేసిన జంగిల్ పాలన మరిచిపోయినట్లు ఉంది. మా పార్టీ నాయకులైన పట్టాభిరామ్ పై దాడి, మా దేవాలయం పార్టీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడి ఇలా చెప్పుకు పోతే పదుల సంఖ్యలో మా పార్టీ ముఖ్యనాయకులపై, వందల సంఖ్యలో మా కార్యకర్తలపై దాడులు చేశారు. జంగిల్ రాజ్ పాలనను చూసి ప్రపంచ కంపెనీల నుండి రోడ్డు పక్కన కొట్టుల సైతం రాష్ట్రం నుంచి పారిపోయాయి. జగన్ పాలన చూసి తట్టుకోలేక రాష్ట్ర ప్రజలు ఆయన్ను 151 సీట్లు నుంచి 11 సీట్లకు దించారు. మరల కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు విజన్ చూసి మరల క్యూ కడుతుంటే.. రాష్ట్రంలో అల్లర్లు చేసి రాజకీయ అనిశ్చితి సృష్టించాలని చూస్తున్నారు. ఇకనైన జగన్ మంచి బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. అంతే గానీ వాళ్ల నాయకులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించడం మానుకోవాలి. జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ఆయన తన 11 మంది ఎమ్మెల్యేలతో ఈనెల 11వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలి.

WhatsApp Join Now
Youtube Subscribe