బిల్ గేట్స్ బృందంతో సీఎం, మంత్రుల భేటీ – స్వర్ణాంధ్ర విజన్ 2047, సంజీవని, మెడ్‌టెక్ సేవలపై వివరాలు

గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ బృందంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావుల, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి, డీఎస్‌బీవీ స్వామి, సవిత, అనిత, కొల్లు రవీంద్ర, దుర్గేష్, పార్థసారథి, నిమ్మల, అనగాని, బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్, సంధ్యారాణి, నారాయణ తదితర అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవలు, మెడ్‌టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలలో సంస్కరణలపై విస్తృత ప్రజెంటేషన్లు నిర్వహించబడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై ప్రణాళికలు, ప్రభుత్వ రంగంలోని ప్రాజెక్టుల వివరాలు గేట్స్ బృందానికి వివరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు, మెడికల్ సర్వీసుల గణనీయమైన ప్రభావం, ప్రజలకు అందించే సౌకర్యాలను వివరించడం జరిగింది. సమావేశంలో భవిష్యత్తులో AI, డిజిటల్ సేవలు, డేటా ఆధారిత పాలనల ద్వారా రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంపై చర్చ జరిగింది.

WhatsApp Join Now
Youtube Subscribe