కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్తో పలు వస్తువులు, సేవల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొన్ని విభాగాలకు పన్ను రాయితీలు లభించగా, మరికొన్నింటిపై భారమేయనున్నారు.
ధరలు తగ్గే అవకాశమున్నవి:
విదేశీ టూరిజం ప్యాకేజీలు, విదేశీ విద్య ఖర్చులు, సోలార్ ప్యానల్స్, ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలు, క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్, ఈవీ బ్యాటరీలు, స్మార్ట్ఫోన్లు–ట్యాబ్లు, విమాన విడిభాగాలు, క్యాన్సర్–డయాబెటిస్ చికిత్స ఔషధాలు, అణు విద్యుత్ పరికరాలు, భారత జాలర్లు పట్టే చేపలు తదితరాలపై డ్యూటీలు తగ్గించడంతో ధరలు తగ్గే అవకాశం ఉంది.
ధరలు పెరగనున్నవి:
ఫ్యూచర్స్–ఆప్షన్స్ ట్రేడింగ్, విలాసవంతమైన వాచ్లు, మద్యం, సిగరెట్లు, బీడీలు, పాన్మసాల, గుట్కా, కాఫీ రోస్టింగ్ యంత్రాలు, కెమెరాలు–షూటింగ్ పరికరాలు. అలాగే కొన్ని రకాల ఎరువుల ధరలు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి.
